Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్డీయేకే మళ్లీ అధికారం? వయనాడ్‌లో రాహుల్ గాంధీ ముందంజ

ఎన్డీయేకే మళ్లీ అధికారం? వయనాడ్‌లో రాహుల్ గాంధీ ముందంజ
, గురువారం, 23 మే 2019 (09:31 IST)
ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వచ్చే దిశగా సాగుతోంది. దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ దాదాపు పూర్తికాగా, అందుతున్న ట్రెండ్స్‌ను అనుసరించి ఎన్డీయే 285 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 107 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఇతరాలు 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
 
ఇకపోతే.. కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మైసూర్‌ లోక్ సభ స్థానంలో బీజేపీ మందంజలో ఉన్నట్లు తెలిసింది. మిగతా చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 16 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నాయి. 
 
కర్ణాటకలో కుమారస్వామి కొడుకు నిఖిల్ వెనకంజలో ఉన్నారు. అక్కడ సుమలత లీడింగ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరం చీపురు పల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు, అభ్యర్థి రాహుల్ గాంధీ వెనకంజలో ఉన్నారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ ముందంజలో వున్నారు. 
 
సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. పులివెందులలో వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. బెంగళూరులో ప్రకాష్ రాజ్ వెనకంజలో ఉన్నారు. ఖమ్మంలో రేణుకా చౌదరి ముందంజలో ఉన్నారు. చీపురు పల్లి, నెల్లూరు, కావలిలో వైసీపీ ముందంజలో ఉంది.
 
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ నువ్వా-నేనా అన్నట్లు కొనసాగుతున్నాయి. రాయలసీమలో వైసీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. శివగంగలో కార్తీ చిదంబరం ముందంజలో ఉన్నారు. తూర్పు ఢిల్లీలో గౌతం గంభీర్ ముందంజలో ఉన్నారు.
 
ఖమ్మం పార్లమెంట్ స్థానంలో నామా నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. కేరళలో కూడా బీజేపీ జోరుగా ఉందని తెలిసింది. అనంతపురం లోక్ సభ స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది.
 
మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. గుంటూరు వినుకొండ అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. మైదుకూరు అసెంబ్లీ సీటులో వైసీపీ ఆధిక్యంలో ఉంది. హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు. 
 
పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో రేణుకాచౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి భరత్ లోక్ సభ స్థానానికి ఆధిక్యంలో ఉన్నారు. అరకులో వైసీపీ ఆధిక్యంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Assembly 2019 Live results - TDP-22 /YSRCP -75