Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను సన్యాసిని.. నాకు ఓటెయ్యకుంటే నిన్ను శపిస్తా..

Advertiesment
2019 Lok Sabha Polls
, శనివారం, 13 ఏప్రియల్ 2019 (10:32 IST)
బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ సాక్షి మహారాజ్‌ మళ్ళీ కొత్త వివాదానికి తెర లేపారు. ఉన్నావో నుంచి ఎంపీగా మళ్ళీ బరిలోకి దిగిన ఆయన ఓటర్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యాలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది.
 
'నేను సన్యాసిని. మీ ఇంటికి వచ్చా.. మీ ఇంటి గడప దగ్గరున్న.. భిక్షం అడుగుతున్నా.. మీరు సన్యాసిని నిరాకరిస్తే.. మీ కుటుంబ సుఖ సంతోషాలను నేను తీసేసుకుంటాను (సంతోషాలు లేకుండా చేస్తా) మిమ్మల్ని శపిస్తా' అంటూ సాక్షి మహారాజ్‌ అన్నారు. అంతేకాకుండా పురాణాల్లో ఉన్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారని ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని రాసింది.
 
నేను సన్యాసిని.. మీరు గెలిపిస్తే.. నేను గెలుస్తా.. లేకుంటే గుళ్లో నేను భజన చేసుకుంటా లేదా కీర్తనలు పాడుకుంటూ ఉంటా..అయితే ఇవాళ నేను ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చాను. మీ ఇంటి గడప దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాను. సన్యాసిని మీరు నిరాకరిస్తే... మీ కుటుంబ సుఖసంతోషాలను నేను తీసేసుకుంటాను. మిమ్మల్ని శపిస్తానని సాక్షి మహారాజ్‌ ఓటర్లను బెదరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ నిర్వహించిన ఏశాట్ ప్రయోగాన్ని సమర్థించిన అమెరికా రక్షణశాఖ..!