Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాల్లో ఆరితేరిన యువ హీరో నిఖిల్.. మూడు పార్టీలకు మద్దతు

Advertiesment
రాజకీయాల్లో ఆరితేరిన యువ హీరో నిఖిల్.. మూడు పార్టీలకు మద్దతు
, బుధవారం, 10 ఏప్రియల్ 2019 (18:04 IST)
సినీ స్టార్లు ఎన్నికల ప్రచారంలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. కొందరు ఆసక్తి చూపి ఏదో ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తే, మరికొందరు దీనికి ఇష్టపడటం లేదు. కానీ హీరో నిఖిల్ మాత్రం పలు పార్టీలకు మద్దతు తెలిపాడు. ముందుగా అతడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశాడు. కర్నూలు జిల్లా వెళ్లి కేఈ ప్రతాప్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దీంతో అతనిపై తెలుగుదేశం ముద్ర పడింది. కానీ నిఖిల్ మాత్రం దీనిని తోసిపుచ్చారు. తాను తెలుగు దేశం వాడిని కానని, కేఈ ప్రతాప్ తనకు అంకుల్ అయినందున ప్రచారంలో పాల్గొన్నానని చెప్పాడు. 
 
మరోసారి జనసేనకు మద్దతు ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో రాజకీయాలు నడుపుతున్నాడు. జనసేన తరఫున విశాఖ నుండి పోటీ చేస్తున్న మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను కలిసి మద్దతు ప్రకటించాడు. లక్ష్మీ నారాయణపై ప్రశంసల వర్షం కురిపించాడు. లక్ష్మీనారాయణ కొత్త రాజకీయం చేస్తున్నారని, బాండ్ పేపర్ల మీద హామీలను రాసిస్తూ ఉన్నాడని జనసేన తరపున చాలా సాధారణ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కూడా పోటీలో ఉన్నారని, ఇది గొప్ప విషయం అని పేర్కొన్నాడు. 
 
అంతటితో తన రాజకీయాలను ఆపలేదు నిఖిల్. తెరాస అభ్యర్థికి కూడా విషెస్ చెప్పి మద్దతు ప్రకటించాడు. సికింద్రాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీలో ఉన్న తలసాని సాయి యాదవ్‌కు మద్దతు పలికాడు. దానిని సమర్ధించుకున్నాడు. తలసాని సాయి యాదవ్ తనకు స్నేహితుడు అని, ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆయన రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలు అని నిఖిల్ మరో పోస్టు పెట్టాడు. ఇలా మూడు పార్టీలతో చేతులు కలిపి రాజకీయం చేసాడు. మొత్తానికి రాజకీయాల జోలికి వెళ్లకుండా ఇండస్ట్రీలోని చాలా మంది కామ్‌గా ఉండిపోతే నిఖిల్ మాత్రం అన్ని పార్టీలనూ చుట్టేస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కష్టాల్లో మాస్ మహారాజా... ముందుకురాని నిర్మాతలు..