సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసే అంశాలు ఫేక్ అయితే ధారాళంగా రిపోర్ట్ చేసే ఆప్షన్ ఇన్‌స్టాగ్రామ్‌లో జతచేయడం జరిగింది.
సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌ను భారీ స్థాయిలో ఉపయోగిస్తున్నారు.
ఇందులో తమ ఫోటోలను పోస్టు చేస్తున్నారు. అందాలను ఆరబోసే హీరోయిన్లకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలెబ్రిటీలకు ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత కొత్త అప్‌డేట్స్‌ను, ఫీచర్స్‌ను జతచేస్తోంది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ హల్ చల్ చేస్తున్నాయని ఆరోపణలను అరికట్టే దిశగా ఇన్‌స్టాగ్రామ్‌లో రిపోర్ట్ అనే ఫీచర్‌ను అమలులోకి తెచ్చింది. ఇన్‌స్టాలో ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయితే ఇకపై ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేయవచ్చు.
54 ఫాక్ట్ చెకింగ్ పార్ట్‌నర్లతో కలిసి 42 భాషల్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. తొలి విడతగా అమెరికాలోని ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఈ ఆప్షన్‌ను అప్‌డేట్ చేస్తున్నారు.