Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీగన్ క్రేజ్ ముగియనుంది... రాబోయేది మీగన్?!

image
, శనివారం, 8 జులై 2023 (18:08 IST)
ఆదిత్య 369 సినిమా చూశారు. భవిష్యత్ కాలానికి వెళ్లిన హీరోహీరోయిన్ల నడుం దగ్గర ఉన్న ఒక బెల్టులో ఉన్న అలారం మోగుతుంది. మీకు ఆకలి వేస్తుందనేదానికి సూచన అని ఆ సినిమాలో భవిష్యత్ కాలంలో ఉన్న వ్యక్తి చెబితే, సినిమా కాబట్టి అంటూ కాస్సేపు నవ్వుకుని వదిలేసి ఉంటారు. కానీ, వాస్తవం దాదాపు అంతే అని అంటోంది డెలివరూ సంస్థ. మీకు ఆకలి వేయడం మాత్రమే సినిమాలో చెప్పి ఉండొచ్చుగాక, అసలు మీరు ఏం తినాలి, మీకు ఎలాంటి ఆహారం తింటే మంచిదనేది మీ శ్వాసను బట్టి తెలిపే సాంకేతికత త్వరలోనే రాబోతుంది. అదీ 2040 నాటికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాంటోందా సంస్థ.
 
అంతే కాదు... ఇలాంటి ఆసక్తికరమైన అంచనాలతో స్నాక్ టు ద ఫ్యూచర్: 2040 శీర్షికన ఓ నివేదికను విడుదల చేసింది. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ట్రెండ్స్ ఏవిధంగా ఉండబోతున్నాయనే అంచనాలతో రూపొందించిన ఈ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా ఆహార పరిశ్రమ నుంచి శాస్త్రవేత్తలు, సాంకేతిక, ఆవిష్కరణ రంగాలకు చెందిన మేధావుల అభిప్రాయాలున్నాయి. ఆసక్తికరమైన ఈ అధ్యయనంలో వెల్లడించిన కీలకాంశాలు ఇలా వున్నాయి.
 
బ్రీత్ ప్రింట్స్ :
సాంకేతిక ఉపకరణాలతో ఏదైనా సాధ్యమేనా అంటే, సాధ్యమే అని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బ్రీత్ టెక్‌తో మీ శ్వాసతోనే మీరు ఏ ఫుడ్ తింటారు, ఆ ఆహారం మీ ఆరోగ్యంపై చూపే ప్రభావం కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందట. రాబోయే కాలంలో హోటల్స్, రెస్టారెంట్‌లలో ఈ బ్రీత్‌టెక్ టెక్నాలజీ ఎక్కువగా వినియోగించే అవకాశాలూ అధికమేనని అంచనా వేసింది.
 
మీ-గనిజం:
సెలబ్రెటీలు మొదలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరకూ వీగనిజం అని ఇప్పుడంటున్నారు కానీ ఇకపై రానున్నది మీ-గనిజం. ఏమిటీ దాని స్పెషాలిటీ అంటే, హైపర్ పర్సనలైజ్డ్ డైట్. ఏఐ సాంకేతికతతో వ్యక్తిగత పోషక అవసరాలకనుగుణంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిబడింది.
 
పర్సనల్ ఏఐ:
మీ ఆహార ప్రాధాన్యతలు, అవసరాలకనుగుణంగా మీకు ఏం కావాలనేది పర్సనల్ ఏఐ చెబుతుంది. ఆదిత్య 369లో చెప్పినట్లు మెదడు పని చేయాల్సిన అవసరం లేదు.
 
ఎడిబల్ బ్యూటీ :
ఆహారం, అందం ఎన్నడూ లేనంత గొప్పగా కలిసిపోతాయి. యాంటీ ఏజింగ్ ఐస్‌క్రీమ్ లాంటి ఎడిబల్ బ్యూటీ ప్రొడక్ట్స్ రాజ్యమేలనున్నాయి.
 
3డీ ప్రిటెండ్ మీల్ ప్లాన్స్ :
ఫుడ్ ప్రిపరేషన్ ఇకపై మరింత సులభం కానుంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో అత్యాధునిక ఆవిష్కరణల కారణంగా ఇది సాధ్యమవుతుందట. 3డీ ప్రింటెడ్ మీల్స్‌తో రుచి, లుక్ పరంగా వంకలు పెట్టే అవకాశం కూడా ఉండకపోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను లేకుండా చేస్తాం: వరంగల్ సభలో ప్రధాని మోదీ