శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే కెమెరాను సదరు సంస్థ పరిచయం చేసింది. శామ్‌సంగ్ సంస్థ గెలాక్సీ ఎ8ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్షన్ వుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, ఇన్-డిస్ ప్లే సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఈ డిస్‌ప్లేను శామ్‌సంగ్ ఇన్‌ఫినిటీ-ఓ అని పిలువబడుతోంది.
గెలాక్సీ ఎ8ఎస్ పేరిట శామ్‌సంగ్ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లో అత్యధికంగా 8 జీబీ రామ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, మూడు ప్రైమరీ కెమెరా సెటప్స్ వున్నాయి. ఈ క్రమంలో 24 ఎంబీ ప్రైమరీ కెమెరా, f/1.7, 10 ఎంబీ టెలీ ఫోటో లెన్స్, f/2.4, 5 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ వంటి ఆప్షన్లు వున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగివున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎ8ఎస్ స్మార్ట్‌ఫోన్.. 3400 ఎం.ఎ.హెచ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ వుంటాయి.
ఫీచర్ల సంగతికి వస్తే..
శామ్‌సంగ్ సంస్థ గెలాక్సీ ఎ8ఎస్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 6.7 ఎం.ఎంతో పంచ్ హోల్ కెమెరా
స్నాప్‌డ్రాగన్ 710 బ్రాజర్,
డుయెల్ సిమ్
డుయల్ 4జీ వోల్ట్ ఇంటర్నెట్ వైఫై, బ్లూటూత్.