భారత మార్కెట్లోకి రెడ్ మీ నోట్ 12 సిరీస్ నుంచి ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. షావోమీ వీటిని తాజాగా చైనా మార్కెట్లో విడుదల చేసింది. రెడ్ మీ 12, రెడ్ మీ 12 ప్రో, రెడ్ మీ 12 ప్రో ప్లస్ ఇలా మూడు రకాలు భారత మార్కెట్లోకి వస్తున్నాయి.
వేరియంట్ ఆధారంగా చైనా మార్కెట్లో వీటి ధరలు రూ.13,600 నుంచి ప్రారంభమవుతున్నాయి. భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేసేదీ కంపెనీ ప్రకటించలేదు. సాధారణంగా చైనాలో విడుదలైన తర్వాత కొన్ని రోజులకు భారత మార్కెట్లోకి వస్తుంటాయి.
రెడ్ మీ 12 వేరియంట్ 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది.