భారత్‌లో నోకియా తాజా సీ-సిరీస్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. నోకియా సీ30 స్మార్ట్‌ఫోన్ రూ 10,999 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. జియో ఎక్స్లూజివ్ ఆఫర్ ద్వారా కస్టమర్లు అదనంగా మరో రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. 6.82 ఇంచ్ డిస్‌ప్లేతో నోకియా సీ30 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.
నోకియా సీ30 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 6000 ఏంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. రిటైల్ స్టోర్స్ సహా ఈకామర్స్ వేదికలు, నోకియా.కాంపైనా ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో లభిస్తుంది.
అదనపు రక్షణ కోసం స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగివుంది. కనెక్టివిటీ ఆప్షన్‌ల విషయానికొస్తే, స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్, 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, GPS + GLONASS, మరియు మైక్రో- USB పోర్ట్ కలిగి ఉంది.