Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

అమెజాన్ ప్రైమ్ డే సేల్ : 65 అంగుళాల స్మార్ట్‌టీవీపై రూ.32 వేల డిస్కౌంట్

ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా అమెజాన్ ప్రత్యేక సేల్‌ను సోమవారం ప్రారంభించింది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఈ సేల్ 36 గంటల పాటు కొనసాగనుంది. అంటే మంగళవారం అర్థరాత్రి 12 గంటలవరకు ఈ సేల్ ఉంటుంద

Advertiesment
Amazon Prime Day 2018 deals
, సోమవారం, 16 జులై 2018 (14:38 IST)
ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా అమెజాన్ ప్రత్యేక సేల్‌ను సోమవారం ప్రారంభించింది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఈ సేల్ 36 గంటల పాటు కొనసాగనుంది. అంటే మంగళవారం అర్థరాత్రి 12 గంటలవరకు ఈ సేల్ ఉంటుంది. మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, స్టోరేజ్ డివైసెస్, టీవీలపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 
 
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొత్తం ఆరు ఫ్లాష్ సేల్స్ కూడా ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్ తగ్గింపు ఇవ్వనున్నారు. ముఖ్యంగా, బోస్ క్యూసీ25 కేవలం రూ.12600కే అందుబాటులో ఉంది. కెనాన్ ఎంట్రీ లెవల్ ఈవోఎస్ 1300డీ ధర రూ.20990గా ఉంది. దీనికితోడు సాయంత్రం 6 గంటలకు ఫ్లాష్ సేల్ ఉంటుంది. ఇందులో భాగంగా ఒక టీవీ ధరకు రెండు టీవీలు పొందే అవకాశం కల్పించారు. 
 
ఇక జులై 17 ఉదయం 9 గంటలకు ఉన్న ఫ్లాష్‌సేల్‌లో టీసీఎస్ 65 అంగుళాల స్మార్ట్‌టీవీపై రూ.32 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎంపిక చేసిన కెనాన్, నికాన్ డీఎస్‌ఎల్‌ఆర్‌లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక అమెజాన్ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఇక ఎల్‌జీ, సోనీ, టీసీఎల్‌లాంటి ప్రీమియం కంపెనీల ఓఎల్‌ఈడీ టీవీలపై కూడా ప్రైమ్ డే ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు ఉన్నాయి. కొన్ని డీల్స్ సోమవారం అర్థరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య చనిపోతే.. శవంతో ఏడు రోజులు గడిపాడు.. చివరికి కొన ఊపిరితో..