Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#ToBennuAndBack నాసా అదుర్స్.. ఉల్క నుంచి పిడికెడు మట్టి తెచ్చింది..!

Advertiesment
#ToBennuAndBack నాసా అదుర్స్.. ఉల్క నుంచి పిడికెడు మట్టి తెచ్చింది..!
, గురువారం, 22 అక్టోబరు 2020 (18:30 IST)
Asteroid Bennu
అనేక సౌర కుటుంబాలు, పాలపుంతలతో విస్తరించిన ఈ విశ్వంలో ఇప్పటి అనేక విషయాలు అంతుచిక్కని ప్రశ్నలే. అయితే, భూమికి చేరువగా ఉన్న గ్రహాలు, గ్రహసకాల గురించి తెలుసు కోవడం ద్వారా ఇతర గ్రహాలపై మానవ మనుగడకు ఎంత వరకూ అవకాశం ఉందనే అంశాలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిలో భాగంగా బెన్ను ఉల్కపై ప్రయోగాలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నాసా మరో అరుదైన ఘనత సాధించింది. భూమికి 33 కోట్ల కిలో మీటర్ల దూరంలో గల ఉల్క నుంచి మట్టి నమూనాను సేకరించింది. దీనిని విశ్లేషించడం ద్వారా సౌరకుటుంబానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్ను ఆస్టరాయిడ్‌పైకి ఓసిరీస్‌ అంతరిక్ష నౌకను పంపింది అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. లాక్హీడ్ మార్టిన్ నిర్మించిన ఓసిరిస్‌ స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన 11 అడుగుల పొడవైన రోబోటిక్‌ చేయి బెన్ను ఉల్క ఉత్తర ధ్రువాన్ని ముద్దాడింది.
 
బెన్ను నుంచి 60 గ్రాముల శకలాల్ని తీసుకురావడానికి 2016లో ఓసిరిస్‌ వ్యోమ నౌకను పంపారు. అది రెండేళ్లుగా ఈ ఉల్క చుట్టూ పరిభ్రమిస్తోంది. ఎట్టకేలకు ఉల్కను తాకి.. రాతి, మట్టి నమూనాలను సేకరించింది. దీనికి సంబంధించిన వీడియోలను నాసా విడుదల చేసింది.
 
ఉల్క ఉపరితలం నుంచి పిడికెడు మట్టి నమూనాలను సేకరించింది. అది సేకరించిన మట్టి నమూనాల చిత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరోసారి బెన్నుపైకి రోబోటిక్‌ హ్యాండ్‌ను దింపి.. మరిన్ని నమూనాలు సేకరిస్తామంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల కోసం వందల కోట్లు ఖర్చు చేసే నాయకులు వరద బాధితుల కోసం ఆ సొమ్ము తీయాలి: పవన్ కళ్యాణ్