Publish Date: Wed, 28 Aug 2019 (21:57 IST)
Updated Date: Wed, 28 Aug 2019 (22:00 IST)
జుట్టు ఊడే సమస్య చాలామందిలో వుంటుంది. కొందరిలో ఇది బట్టతలకు దారితీస్తుంది. ఐతే కేశాల సంరక్షణను చాలామంది పట్టించుకోరు. కేశాలు ఊడటం ప్రారంభమయ్యాక పరుగులు పెడుతుంటారు. అలాక్కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు పట్టుకుచ్చులా ఒత్తుగా వుంటుంది.
1. తలస్నానం చేసిన తరువాత పావుగంట సేపు మాడుపై మసాజ్ చేసుకోవాలి.
2. కొంతమంది జుట్టు చిక్కులతో చిందరవందరగా ఉంటుంది. అలాంటి జుట్టు గలవారు గ్రుడ్డులో పచ్చసొనతో తలమీద, జుట్టు పట్టించి మృదువుగా మసాజ్ చేసుకోవాలి. అరగంట సేపు ఆగి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తలను మెత్తటి టవల్‌తో జుట్టుని రఫ్‌గా రుద్దేస్తూ తుడుచుకోకుండా, మృదువుగా మెల్లగా తుడుచుకోవాలి.
3. చుండ్రు సమస్యలు ఉన్నవారు. సెలీనియా, సల్‌ఫైడ్ లేదా స్యాలిసిలిస్ ఆమ్లంతోగానీ ఉండే షాంపూలను వాడాలి.ఇవి మీ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలవు.
4. మార్కెట్‌లో సబ్బులు అందుబాటులో ఉంటాయి. అయిలీ వెంట్రుకలు గల వారు మాత్రమే వారానికి ఒక్క సారి వాడాలి. ఈ సబ్బు జుట్టును పొడిబారేటట్లు చేస్తుంది.
5. తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. ఆరోగ్యానికి ఎలాంటి చిక్కు రాదు.