Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే?

Advertiesment
పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే?
, బుధవారం, 3 జులై 2019 (17:22 IST)
కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు. ఏ పనీ చేయలేరు. త్వరగా అలసిపోతారు, నీరసంగా కూడా ఉంటారు. దీనికి అనారోగ్యం, పౌష్టికాహార లోపం, పని ఒత్తిడి వంటి పలు కారణాలు ఉన్నాయి. ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అలా తయారవడానికి కొన్ని చిట్కాలు పాటించండి. ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. 
 
అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది. రోజూ గ్లాస్ లెమన్ జ్యూస్‌లో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. 
 
నిద్ర మనకు చాలా ముఖ్యం. నిద్రలేమి వలన అనేక అనారోగ్యాలు వస్తాయి. మంచి నిద్రపట్టాలంటే రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి సేవిస్తే సరిపోతుంది. శరీరంలో తగిన మోతాదులో రక్తం లేకపోయినా కూడా నీరసంగా ఉంటుంది. ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్వరంతో భాదపడే వారు అన్నం తినవచ్చా..?