Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలెక్టరేట్‌లోనే మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి యత్నం

Advertiesment
woman victim

ఠాగూర్

, సోమవారం, 13 అక్టోబరు 2025 (14:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. సాక్షాత్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఓ మహిళా ఉద్యోగినిపై లైంగికదాడి జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా అక్కడే పని చేసే కామాంధుడైన ఉద్యోగి కావడం గమనార్హం. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రెండు రోజుల క్రితం కలెక్టరేట్ ప్రాంగణంలోనే నిందితుడైన సీనియర్ అసిస్టెంట్.. తనతో పాటే పనిచేసే ఓ మహిళా సిబ్బందిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అతని బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆ బాధితురాలు నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులకు నిందితుడిపై లైంగిక వేధింపులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి నిందితుడుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే, జిల్లా కేంద్ర పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌‌లోనే ఒక అధికారి ఇంతటి దారుణానికి పాల్పడటం వెనుక ఉన్నతాధికారుల అండదండలు ఉండివుండొచ్చని ఇతర మహిళా అధికారులు ఆరోపిస్తున్నారు. గత నెలలో ఇలాంటి వేధింపులు వచ్చిన మరో ఉద్యోగిని కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని వారు గుర్తుచేస్తున్నారు. కాగా, తాజా ఘటనతో కలెక్టరేట్‌లోని మహిళా సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎన్డీయే కూటమి మధ్య కుదిరిన సీట్ల పంపకం