ముంబై నగరంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై 29 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో కేసును నమోదు చేసారు పోలీసులు. కేసు నమోదయ్యాక నిందితుడు బాధితురాలితో అవగాహనకు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు.
అనంతరం వారికి ఓ మగబిడ్డ పుట్టాడు. దీనితో తనపై పెట్టిన పోక్సో కేసును వాపసు తీసుకునేందుకు బాధితురాలు అంగీకరించింది. ఈ విషయమై బాధితురాలు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఐతే బాలికపై అత్యాచారం చేసిందుకు నమోదు చేసిన పోక్సో కేసు, బాధితురాలిని వివాహం చేసుకుంటే రద్దు అయ్యే అవకాశం లేదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.