Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలి తల్లి ఎఫైర్‌ను వీడియోలో బంధించాడు, ఆ తర్వాత...

Advertiesment
young man
, సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:45 IST)
తనతో పాటు చదువుకునే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు బాగా దగ్గరయ్యాడు. శారీరకంగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆమెను కలిసేందుకు వచ్చిన ప్రియుడు కాస్త ఆమె తల్లిపై మోజు పెంచుకున్నాడు. ఆమెను అనుభవించాలనుకున్నాడు. చివరకు ఆమె చేసే పని చూసి షాకై డబ్బులు సంపాదించాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చివరకు..
 
మహారాష్ట్ర పుణే నగరంలో నివాసముంటున్న సౌమ్య డిగ్రీ చదువుతోంది. తనతో పాటు విద్యనభ్యసిస్తున్న మోహన్ రాజ్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం సౌమ్య తల్లి అతిథికి తెలుసు. ప్రేమ మాత్రమే అనుకుంది అతిథి. కానీ అంతకుమించి శారీరకంగా ఇద్దరూ ఒకటవుతున్నారన్న విషయం ఆమెకు తెలియదు. 
 
కరోనా కారణంగా కాలేజీలు లేకపోవడంతో మోహన్ రాజ్‌తో పాటు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేది సౌమ్య. కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్ళిందే తన ప్రియుడు విక్కీని ఇంటికి పిలిపించుకునేది తల్లి.
 
అతిథి భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ప్రియుడిని సెట్ చేసుకుంది. సౌమ్య కోసం ఇంటికి వచ్చి వెళుతుండే మోహన్ రాజ్ అతిథి బాగోతాన్ని పసిగట్టాడు. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న వీడియోలను తీశాడు.
 
ఆ వీడియోలతో గత నెలరోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. మొదట్లో ఆమెను అనుభవించాలనుకున్నాడు. కానీ ఆమె దగ్గర ఆస్తి ఉండటంతో డబ్బుకు ఆశపడి 15 లక్షల రూపాయలు కావాలంటూ లేకుంటే ఆ వీడియోలను ఇంటర్నెట్లో పెట్టేస్తానంటూ బెదిరించాడు.
 
ఇలా ఆమె దగ్గర సుమారు 10 లక్షల రూపాయల దాకా వసూలు చేశాడు. ఇంకా ఇంకా డబ్బులని పీడిస్తుంటే అతిథి పోలీసులకు ఆశ్రయించింది. ఎవరో కూడా తెలియకుండా డబ్బులు ముట్టజెబుతూ వచ్చిన అతిథి పోలీసుల విచారణ తరువాత విక్కీని చూపించడంతో షాకైంది.
 
తన కూతురిని ప్రేమించిన ప్రియుడే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలుసుకోలేకపోయింది. దీంతో అతన్ని అదుపులోకి పోలీసులు తీసుకోగా మనస్థాపంలో సౌమ్య ఆత్మహత్యకు పాల్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులు వరిపంట సాగు చేయొద్దు : సీఎం కేసీఆర్ షాక్