ఢిల్లీలో అచ్చం ఉప్పెన చిత్రంలో హీరోకి హీరోయిన్ తండ్రి ఎలాంటి శిక్ష విధించాడో అలాంటి శిక్షనే విధించారు. ఢిల్లీలో ఓ యువకుడి ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. వారి ప్రేమను ససేసిమిరా అంగీకరించలేదు.
దీనితో ప్రేమికులిద్దరూ పారిపోయి వివాహం చేసుకున్నారు. గుట్టుగా వేరే కాపురం పెట్టి వుంటున్నారు. ఐతే వారి ఆచూకిని కనుగొన్న యువతి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తన కుమార్తెను పెళ్లాడిన యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు. నానా రకాలుగా హింసించారు. ఆ తర్వాత అతడి మర్మాంగాన్ని కత్తితో కోసేసారు.
ఆ తర్వాత అతడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తన కుటుంబ సభ్యుల కారణంగా తమకు ప్రాణహాని వున్నదంటూ యువతి రాజౌరి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.