Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ, ధోనీ లేని జట్టా? ఐసీసీపై గుర్రుగా వున్న భారత క్రికెట్ ఫ్యాన్స్

Advertiesment
World Cup 2019
, బుధవారం, 17 జులై 2019 (11:48 IST)
2019 ప్రపంచ కప్ అత్యాంత వివాదాస్పదమైనదనే విమర్శలను ఎదుర్కొంటోంది. తొలుత వర్షం.. ఆ తర్వాత అంపైర్ల పేలవ నిర్ణయాలు.. చివరికి ఫైనల్ ఫలితం. వివాదాలతోనే ముగిసింది ఈ ప్రపంచకప్ సమరం. ఇప్పటికే ఐసీసీపై క్రికెట్ ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు. ఈ ప్రపంచ కప్‌లో హీరోలుగా నిలిచిన వారితో ఐసీసీ ఓ జట్టును తయారు చేసి మళ్లీ భారత ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. 
 
దేశంతో సంబంధం లేకుండా తయారు చేసిన ఈ జట్టులో భారత్ నుంచి ఇద్దరికి చోటు లభించింది. అందులో రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. విశేషమేమిటంటే.. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కలేదు.
 
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ ఎంపికవగా, 12వ ఆటగాడిగా న్యూజిలాండ్‌కు చెందిన బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఇంగ్లండ్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. 
 
ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్ ఉన్నారు. ఇక, కోహ్లీ జట్టులో లేకపోవడంపై అభిమానులు ఐసీసీపై గుర్రుగా వున్నారు. అసలు ఐసీసీకి ఏమైంది అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫలితాన్ని మరోమారు సమీక్షించాలి : గ్యారీ స్టీడ్