ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ ఆరంభమైంది. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.
సూపర్-12, గ్రూపు బిలో ఉన్న భారత జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం పటిష్టమైన సౌతాఫ్రికా జట్టుతో తలపడుతుంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్‌కు మొగ్గు చూపారు.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక్క మార్పు చేశారు. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు స్థానం కల్పించింది. అటు సౌతాఫ్రికా కూడా ఒక మార్పు చేశారు. స్పిన్నర్ షంసీని తొలగించి ఆయన స్థానంలో ఎంగిడీకి తుది జట్టులో చోటు కల్పించింది.
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్ల వివరాలు..
భారత్ : రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్
సౌతాఫ్రికా : టెంబా బవుమా, క్వింటన్ డికాక్, రిలీ రూసో, అయిడెన్ మర్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్, రబాడా, లుంగి ఎంగిడి, ఆన్రిస్ నోర్జే