Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీజీ స్కాలర్లకు నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్‌

Advertiesment
AICTE PG Scholarship 2021-22 Registration Open
, సోమవారం, 11 అక్టోబరు 2021 (13:57 IST)
ఇంజనీరింగ్‌ సహా ప్రొఫెషనల్‌ కోర్సుల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుభవార్త తెలిపింది. ఏఐసీటీఈ అనుమతితో నడిచే ప్రొఫెషనల్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో పీజీ చదివే వారిలో అర్హులైన వారికి నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌ షిప్‌ ను ఇవ్వనున్నట్లు తెలిపింది. విద్యార్థులు https://www.aicte-india.org/schemes/students-development-schemes/PG-Scholarship-Scheme లో ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించాలని పేర్కొంది. 
 
అభ్యర్థులు డిసెంబర్‌ 31లోగా ఈ పోర్టల్‌ ద్వారా లాగిన్‌ ఐడీని క్రియేట్‌ చేసుకుని వచ్చే జనవరి 15 లోపు దరఖాస్తును సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,400 చొప్పున 'ఏఐసీటీఈ పీజీస్కాలర్‌షిప్‌' కింద వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారు వారానికి 8 నుంచి 10 గంటలు వారి విద్యాసంస్థ సూచించిన మేరకు టీచింగ్, రీసెర్చి ప్రక్రియల్లో పాల్గొనాలి.
 
దరఖాస్తుదారులు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌), గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జీపాట్‌), కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌)లలో నిర్ణీత స్కోరు సాధించి ఉండాలి. మాస్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, మాస్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొంది ఉండాలి. 24 నెలలు కొనసాగే ఈ ఉపకార స్కాలర్‌షిప్‌ కు డ్యూయెల్‌ డిగ్రీ చదువుతున్నవారు కూడా అర్హులే. ఇతర వివరాలకు ఏఐసీటీఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో క‌రెన్సీ, బంగారం, వెండితో దుర్గ‌మ్మ అలంక‌ర‌ణ‌