Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిఎల్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓగా నియమితులైన జరీన్ దారువాలా

Advertiesment
Zarin Daruwala

ఐవీఆర్

, సోమవారం, 27 అక్టోబరు 2025 (20:51 IST)
పిఎల్ క్యాపిటల్ (ప్రభుదాస్ లీలాధర్ గ్రూప్), భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ ఆర్థిక సేవల సంస్థలలో ఒకటి, జరీన్ దారువాలాను గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించినట్లు ప్రకటించడం గర్వంగా ఉంది, ఇది అక్టోబర్ 13, 2025 నుండి అమల్లోకి వస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో గొప్ప నాయకురాలిగా పేరుగాంచిన జరీన్ దారువాలా, కార్పొరేట్ మరియు రిటైల్ బ్యాంకింగ్, గవర్నెన్స్, వ్యూహాత్మక నాయకత్వం వంటి విభాగాల్లో 35 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవాన్ని కలిగి ఉన్నారు.
 
పిఎల్ క్యాపిటల్‌లో చేరడానికి ముందు, ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో భారతదేశం మరియు దక్షిణ ఆసియా సీఈఓగా సేవలందించారు. ఆ పదవిలో ఆమె బ్యాంక్ పరివర్తనకు, ఈ ప్రాంతంలో స్థిరమైన వృద్ధికి విజయవంతంగా నాయకత్వం వహించారు. ఆమె నాయకత్వంలో, బ్యాంక్ యొక్క రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారం సంపద నిర్వహణపై దృష్టి కేంద్రీకరించిన వ్యూహాత్మక మార్పు సాధించింది. అదేవిధంగా, భారతదేశం యొక్క పెరుగుతున్న సంపద సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాన్ని ఆవిష్కరణ మరియు వృద్ధికి భాగస్వామిగా తీర్చిదిద్దారు.
 
జరీన్ దారువాలా, పిఎల్ క్యాపిటల్ యొక్క పరివర్తన ప్రయాణంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆమె నాయకత్వంలో సంస్థ తన పరిధిని విస్తరించడమే కాకుండా, సామర్థ్యాలను బలోపేతం చేయడం, బ్రోకింగ్-డిస్ట్రిబ్యూషన్, ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ అడ్వైజరీ, ప్రైవేట్ క్రెడిట్, వెల్త్ మరియు అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ను మరింత విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది.
 
శ్రీమతి అమీషా వోరా, యజమాని, చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, పిఎల్ క్యాపిటల్ ఇలా పేర్కొన్నారు, జరీన్ దారువాలా నియామకం పిఎల్ క్యాపిటల్‌కి ఒక నిర్ణయాత్మక మైలురాయి. వృద్ధి- వైవిధ్యీకరణపై సాహసోపేతమైన దృష్టితో, మేము మా వ్యాపారాలను గణనీయంగా విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాము. జరీన్ నియామకం, శాశ్వతమైన, సంస్థాగతంగా నడిచే సంస్థను నిర్మించాలనే మా దృఢ సంకల్పానికి ప్రతీక. ఇది మా వారసత్వం మరియు నమ్మకాన్ని, ఆధునిక సామర్థ్యాలు, గ్లోబల్ ప్రమాణాలతో సమన్వయం చేస్తుంది. ఆమె నాయకత్వం గ్రూప్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుందని మేము విశ్వసిస్తున్నాము.
 
శ్రీమతి జరీన్ దారువాలా, సిఇఒ, పిఎల్ క్యాపిటల్ గ్రూప్ ఇలా అన్నారు, ఇంత ప్రేరణాత్మక దశలో పిఎల్ క్యాపిటల్‌లో చేరడం నాకు గౌరవంగా ఉంది. ఈ గ్రూప్‌కు బలమైన పునాది, లోతైన మార్కెట్ అవగాహన మరియు క్లయింట్-ఫస్ట్ వంటి విలువలు ఉన్నాయి. ఆవిష్కరణ, విలువ మరియు ప్రభావాన్ని అందించే భవిష్యత్‌ సిద్ధ ఆర్థిక సేవల వేదికను నిర్మించాలనే దృష్టితో నేను ఉత్సాహంగా ఉన్నాను. అభివృద్ధి యొక్క తదుపరి అధ్యాయాన్ని నిర్మించడానికి అమీషా మరియు నాయకత్వ బృందంతో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను."
 
జరీన్ నియామకం పిఎల్ క్యాపిటల్‌కు కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సంస్థ తన కీలక విభాగాలలో విస్తరణను వేగవంతం చేస్తూ, సాంకేతికత మరియు ప్రతిభలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సంస్థలు మరియు ఫ్యామిలీ ఆఫీసుల నమ్మకమైన భాగస్వామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ