Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Silver Loan: బంగారమే కాదు.. ఇకపై వెండి కూడా తాకట్టు పెట్టుకోవచ్చు.. ఆర్బీఐ కీలక నిర్ణయం

Advertiesment
Silver

సెల్వి

, ఆదివారం, 26 అక్టోబరు 2025 (13:14 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం తరహాలోనే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. 
 
అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Telangana: మద్యం దరఖాస్తు అప్లికేషన్లతోనే రూ. 2860 కోట్లు సంపాదించిన తెలంగాణ