Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ ధనత్రయోదశి నాడు ఇన్‌స్టామార్ట్‌లో ఒక గ్రాము బంగారం నుండి ఒక కిలో వెండి ఇటుకల వరకు...

Advertiesment
gold

ఐవీఆర్

, గురువారం, 16 అక్టోబరు 2025 (23:22 IST)
భారతదేశం వ్యాప్తంగా ఐదు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ శుభప్రదంగా ప్రారంభమయ్యే ధనత్రయోదశి పురస్కరించుకుని, భారతదేశపు అగ్రశ్రేణి త్వరిత వాణిజ్య వేదిక అయిన ఇన్‌స్టామార్ట్, కీలకమైన మెట్రో నగరాలలో విస్తృత శ్రేణి బంగారం, వెండి నాణేలతో పాటు 1 కిలో వెండి ఇటుకలను సైతం వినియోగదారులకు అందించటానికి సిద్ధమైంది. ఈ ప్లాట్‌ఫామ్ కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్- డైమండ్స్, ముత్తూట్ ఎగ్జిమ్, ఎంఎంటిసి-పిఏఎంపి, మిఆ బై తనిష్క్, వోయిల్లా వంటి విశ్వసనీయ బ్రాండ్‌లతో, గుల్లక్ వంటి కొత్త ప్రవేశదారులతో కలిసి సర్టిఫైడ్ బంగారం మరియు వెండి నాణేలను అందిస్తుంది. ఈ సందర్భంగా వెండి ఆభరణాలు, పాత్రలు వంటి ఇతర వస్తువులను కూడా ఇది డెలివరీ చేస్తుంది.
 
వినియోగదారులు 0.1 గ్రా నుండి 10 గ్రా వరకు బరువున్న బంగారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఇది ప్రతి బడ్జెట్‌కు అనువైన రీతిలో ఉంటుంది. త్వరిత వాణిజ్యంలో మొదటిసారిగా, ఇప్పుడు ఒక కిలో బరువున్న వెండి ఇటుకను సైతం వినియోగదారులకు వారి ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. పండుగ సంతోషానికి తోడు, ఇన్‌స్టామార్ట్ ప్రత్యేకమైన ఎర్లీ బర్ద్ ఆఫర్‌ను సైతం అందిస్తోంది: ధంతేరాస్‌ నాడు ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువ బంగారు నాణేలను కొనుగోలు చేసే మొదటి 10,000 మంది కస్టమర్‌లకు రూ. 100 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 18న ఉదయం 7:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. 
 
ఇప్పుడు అధిక సంఖ్యలో వినియోగదారులు వేడుకల కోసం లేదా పెట్టుబడి ప్రయోజనాల కోసం విలువైన లోహాలను కొనుగోలు చేస్తున్నప్పటికీ, ప్రతి కొనుగోలుకు నమ్మకం అత్యంత కీలకంగా మారింది. అన్ని బంగారు నాణేలు 999 హాల్‌మార్కింగ్‌ను కలిగి ఉంటాయి. దీనికి ఎటువంటి మేకింగ్ ఛార్జీలు ఉండవు, అయితే వెండి నాణేలు స్వచ్ఛత పరంగా ధృవీకరించబడతాయి. సౌకర్యవంతంగా ఆర్డర్ చేసే అవకాశంతో పాటుగా ఇంటింటికీ డెలివరీ చేయడంతో, అధిక విలువ కలిగిన పండుగ కొనుగోళ్లు కూడా ఇప్పుడు  కేవలం ఒక ట్యాప్ దూరంలో ఉన్నాయి.
 
గత కొన్ని సంవత్సరాలుగా, ఇన్‌స్టామార్ట్‌లో బంగారం, వెండికి డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది, ముఖ్యంగా అక్షయ తృతీయ, ధంతేరాస్ వంటి పండుగల సమయంలో ఇది అధికంగా కనిపిస్తోంది. గత సంవత్సరం, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ NCR, అహ్మదాబాద్ వంటి నగరాలు ఈ ప్లాట్‌ఫామ్‌పై అత్యంత విలువైన లోహ ఆర్డర్‌లను ఇచ్చాయి. ఒక గ్రాము బంగారు నాణెం అత్యంత ప్రజాదరణ పొందిన విలువగా నిలిచింది. గత దీపావళిలో, కొచ్చిలో ఒక వినియోగదారు రూ. 8.3 లక్షల విలువైన బంగారు ఆర్డర్‌ను ఇచ్చారు, ఇది వినియోగదారులు రోజువారీ నిత్యావసరాలకు మించి త్వరిత వాణిజ్యాన్ని ఉపయోగించాలనే సుముఖతను చూపుతుంది.
 
తమ ఇల్లు, వంటగది కోసం కొత్త పాత్రలను కొనుగోలు చేయడం ద్వారా ధంతేరాస్‌ను జరుపుకోవాలనుకునే వినియోగదారుల కోసం, ఇన్‌స్టామార్ట్ వివిధ రకాల వంట సామాగ్రి, ప్రెషర్ కుక్కర్లు, కడైలు, తవాస్, థాలిలను చేర్చటం ద్వారా తమ ఎంపికను విస్తరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌టెల్ క్లౌడ్ బలోపేతానికి IBMతో భారతీ ఎయిర్‌టెల్ కీలక భాగస్వామ్యం