Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

అత్యున్నత నాణ్యత కలిగిన పాలు సరఫరా చేసేందుకు 27 రకాల పరీక్షలను చేస్తోన్న సిద్స్‌ ఫార్మ్‌

Advertiesment
Sid’s Farm
, సోమవారం, 7 జూన్ 2021 (23:06 IST)
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించడంలో సుపరిచితం. ఈ కంపెనీ ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) సూచించిన పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా 27 రకాల పరీక్షలను చేస్తున్నట్లు వెల్లడించింది.  

హైదరాబాద్‌లో అధికంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సిద్స్‌ ఫార్మ్‌ ఇప్పుడు తమ పాలలో హార్మోన్లు, నిల్వ రసాయనాలు, యాంటీబయాటిక్స్‌ లేవని మిల్లీనియల్‌ తరానికి భరోసా అందిస్తుంది. ఈ బ్రాండ్‌కు ఈ ప్రాంతంలో 100కు పైగా స్టోర్లుఉండటంతో పాటుగా బిగ్‌బాస్కెట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ఈ–కామర్స్‌ వేదికల ద్వారా కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
 
సిద్స్‌ ఫార్మ్‌లో ఉత్పత్తి అయ్యే పాలు ప్రతి రోజూ భౌతిక పరీక్షలు, రసాయన పరీక్షలతో పాటుగా మైక్రోబయాలాజికల్‌ పరీక్షలకు కూడా గురవుతుంటాయి. ఈ పరీక్షలు, సాధారణంగా మార్కెట్‌లో పలు బ్రాండ్లు  పాలలో కనిపించే కొవ్వులు, సాలిడ్స్‌–నాట్‌ ఫ్యాట్‌ (ఎస్‌ఎన్‌ఎఫ్‌), యూరియా, పంచదార, మాల్టోడెక్సిట్రిన్‌, యాంటీబయాటిక్స్‌, అమ్మోనియం, పురుగుమందులు, విషపూరిత రసాయనాలు, బ్యాక్టీరియా కలుషితం కాలేదని నిర్థారిస్తాయి.
 
సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌, సీఈవో డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘ఈ పరీక్షలను అత్యాధునిక సదుపాయాలలో చేస్తున్నాము.  తద్వారా పాల డెలివరీ వరకూ ఎలాంటి హార్మోన్లు,  నిల్వకారకాలు ఉండవని నిర్ధారిస్తున్నాము. భారతీయ వినియోగదారులు అధికశాతం రసాయనాలనే  సేవిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం సిద్స్‌ ఫార్మ్‌ అందించాలనుకుంటుంది. నాణ్యమైన ఆహారానికి అధికంగా చెల్లించడానికి వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మార్కెట్‌ను ఒడిసి పట్టడానికి తాము ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ తమ లక్ష్యిత వినియోగదారులు అతి స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు పొందగలరంటూ, హైదరాబాద్‌లో 10% మార్కెట్‌ను 2025 నాటికి అందుకోవాలని లక్ష్యంగా చేసుకున్నామని ఆయన వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో 12 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీఓఈ)లను జోడించనున్న ఎస్‌టీపీఐ: డైరెక్టర్‌ జనరల్‌, ఎస్‌టీపీఐ