Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో 12 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీఓఈ)లను జోడించనున్న ఎస్‌టీపీఐ: డైరెక్టర్‌ జనరల్‌, ఎస్‌టీపీఐ

మరో 12 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీఓఈ)లను జోడించనున్న ఎస్‌టీపీఐ: డైరెక్టర్‌ జనరల్‌, ఎస్‌టీపీఐ
, సోమవారం, 7 జూన్ 2021 (22:58 IST)
ఎస్‌టీపీఐ యొక్క బీపీఓ ప్రమోషన్‌ పథకంలో భాగంగా ప్రస్తుతం 247 బీపీఓ/ఐటీఈఎస్‌ యూనిట్లు 102 నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 41,628 మంది వ్యక్తులు ప్రత్యక్షంగా ఉపాధి పొందగా, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉద్యోగులు ఉన్నారు (10,673).
 
సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) 30వ ఫౌండేషన్‌ డే పురస్కరించుకుని ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ మాట్లాడుతూ 12 సీఈఓలను అదనంగా జోడించడానికి ఇటీవలనే అనుమతులు పొందామని, త్వరలోనే వీటిని పలు నగరాలలో ప్రారంభించనున్నామన్నారు.

వైజాగ్‌లో ఇండస్ట్రీ4.0 టెక్నాలజీ సీఓఈను ప్రారంభించనున్నామంటూ, హెల్త్‌టెక్‌, బిగ్‌ డాటా, ఏఐకు సంబంధించిన సీఓఈ ఏఐసీ ఎస్‌టీపీఐ నెక్ట్స్‌‌ను బెంగళూరులో; వ్యవసాయ సీఓఈలో ఐఓటీని అకోలా; ఈశాన్య రాష్ట్రాల రాజధాని నగరాలు గ్యాంగ్‌టక్‌ (హెల్త్‌కేర్‌, అగ్రిటెక్‌లో ఐటీ అప్లికేషన్స్‌), ఇటా నగర్‌(డ్రోన్‌ టెక్‌ సహా జీఐఎస్‌ అప్లికేషన్స్‌), కోహిమా (గ్రాఫిక్‌ డిజైన్‌ లో ఐటీ అప్లికేషన్‌), ఐజ్వాల్‌ (గేమింగ్‌), అగర్తలా(డాటా ఎనలిటిక్స్‌) వీటిలో కూడా ఈ సీఓఈలలో ఉన్నాయని వెల్లడించారు.
 
తమ 30వ ఫౌండేషన్‌ డే పురస్కరించుకుని డాక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ మాట్లాడుతూ భారతీయ ఐటీ పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు తాము నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు. సంస్థ పని సంస్కృతిలోనే పోటీతత్త్వం జొప్పించామంటూ పలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు 13 సీఓఈల ఏర్పాటుకు తోడ్పాటునందించాయని, నిర్ధేశించుకున్న కాలంలో ఈ 12సీఓఈలను ప్రారంభించేందుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు.
 
భారతదేశంలో మూడు కేంద్రాలతో కార్యకలాపాలు ఆరంభించిన తాము ఇప్పుడు దేశవ్యాప్తంగా 60 కేంద్రాలను కలిగి ఉన్నామన్నారు. దేశం నుంచి ఐటీ ఎగుమతులను వృద్ధి చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామంటూ, 1992లో 17 కోట్ల రూపాయలుగా ఉన్న ఐటీ/ఐటీఈఎస్‌ ఎగుమతులు 2020-22 నాటికి 5.08 లక్షల  కోట్ల రూపాయలకు చేరుకున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2020-21 సంవత్సరంలో 836.42 కోట్ల రూపాయల ఎగుమతులు వీటిలో ఉన్నాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం: ప్రధాని మోదీ