Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేచురల్‌ పన్నీర్‌ను విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌

నేచురల్‌ పన్నీర్‌ను విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (15:58 IST)
తెలంగాణా కేంద్రంగా కలిగిన ఆధునిక పాల ఉత్పత్తుల బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ తమ వినియోగదారులకు నాణ్యమైన ఆహారం మరియు పదార్థాలను అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న విలువ ఆధారిత ఉత్పత్తుల జాబితాలో అతి కీలకమైన జోడింపుగా నేచురల్‌ పన్నీర్‌ను ఆవిష్కరించింది. దీనిలోని వినూత్నమైన అంశం ఏమిటంటే, పాలలో ఎలాంటి  హార్మోన్లు, యాంటీబయాటిక్స్‌ లేదంటే నిల్వ చేసే పదార్థాలను వాడకపోవడం.
 
ఈ కారణం చేత పన్నీర్‌ యొక్క తాజాదనం మరియు మృదత్వం నిర్వహించబడుతుంది. నూతనంగా ఆవిష్కరించిన పన్నీర్‌ ‘సాఫ్ట్‌ అండ్‌ క్రీమీ పన్నీర్‌’ గా పిలువబడుతుంది. తమ రోజువారీ ఆహారంలో  తగినంతగా ప్రొటీన్‌ను పొందాలని కోరుకునే శాఖాహారులను ఇది లక్ష్యంగా  చేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాలలో ఒకటిగా పన్నీర్‌ నిలిచింది. ఈ నేచురల్‌ పన్నీర్‌ 200 గ్రాముల ప్యాక్‌ 150 రూపాయల ధరలో లభిస్తుంది.
 
ఈ ఆవిష్కరణతో, భారతదేశంలో 75వేల కోట్ల రూపాయలుగా ఉన్న పన్నీర్‌ మార్కెట్‌లో  తమ వాటాను సొంతం చేసుకోవడం కోసం కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణాలో స్థానిక బ్రాండ్‌గా ఉన్న సిద్స్‌ఫార్మ్‌ త్వరలోనే ప్రాంతీయ బ్రాండ్‌గా నిలవాలని లక్ష్యం చేసుకోవడంతో పాటుగా తాజా పన్నీర్‌ రుచులను సొంతం చేసుకోవాలనే వినియోగదారులనూ లక్ష్యంగా చేసుకుంది. అసలైన తాజాదనం, మృదత్వం కలిగిన నేచురల్‌ పన్నీర్‌తో, భారతీయ కుటుంబాలు ఇప్పుడు రుచికరమైన, ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన రుచికరమైన పన్నీర్‌ రెసిపీలను సౌకర్యవంతంగా తమ ఇంటి వద్దనే ఆస్వాదించవచ్చు. ఈ బ్రాండ్‌ ఇప్పుడు  తమ నేచురల్‌ పన్నీర్‌ తాజా దనాన్ని అతి తక్కువ షెల్ఫ్‌ లైఫ్‌తో నిర్ధారిస్తుంది.
 
నేచురల్‌ పన్నీర్‌ను ఆవిష్కరించిన అనంతరం సిద్స్‌ ఫార్మ్స్‌ వ్యవస్థాపకులు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (ఫౌండర్‌ అండ్‌ సీఈవో) డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘తమ వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలన్నది తమ బ్రాండ్‌ సిద్ధాంతం మరియు పాల ఉత్పత్తులకు సంబంధించి అసలైన తాజా దనపు అనుభవాలను  వినియోగదారులకు అందించాలని కోరుకుంటున్నాం. తెలంగాణాలో ఆరోగ్యవంతమైన పాల ఉత్పత్తులను పరిచయం చేసిన ఒకే ఒక్క కంపెనీగా వినియోగదారుల కోసం మరిన్ని ఉత్పత్తులను జోడించగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
‘ఇండియన్‌ డెయిరీ మార్కెట్‌ రిపోర్ట్‌ అండ్‌ ఫోర్‌కాస్ట్‌ 2021-2026 ’పేరిట ఈఎంఆర్‌ విడుదల చేసిన  నూతన అధ్యయనంలో భారతీయ డెయిరీ మార్కెట్‌ 2020లో దాదాపు 145.55 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉంది. అంతేకాదు, ఈ మార్కెట్‌ 2021-2026 మధ్యకాలంలో 6% సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా. సిద్స్‌ ఫార్మ్‌ పరిమాణం పరంగా చిన్నదే కావొచ్చు కానీ విస్తరిస్తోన్న ఈ మార్కెట్‌లో తమ పాదముద్రికలను నిలుపుకునే దిశగా ప్రయత్నాలను చేస్తుంది.
 
‘‘తెలంగాణా వినియోగదారుల నడుమ తమ ఇతర పాల ఉత్పత్తులు అత్యంత ప్రాచుర్యం పొందాయి. మా మొత్తం పాల ఉత్పత్తుల శ్రేణితో, చెప్పుకోతగ్గ మార్కెట్‌ వాటాను పొందడంతో పాటుగా కుటుంబాలు, చిన్నారుల నడుమ పన్నీర్‌ పట్ల అభిరుచిని సైతం వృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకున్నాం. ఇతర పోటీదారుల పన్నీర్‌ షెల్ఫ్‌ లైఫ్‌ 12-15రోజుల వరకూ ఉండగా మా నేచురల్‌ పన్నీర్‌ షెల్ఫ్‌ లైఫ్‌ గరిష్టంగా మూడు రోజులు మాత్రమే ఉంది. ఇది తాము ఆవిష్కరించిన ఉత్పత్తి నాణ్యతను నిర్థారిస్తుంది’’ అని డాక్టర్‌ కిశోర్‌ జోడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొత్తం ఆక్సిజన్ కేటాయించలేం.. మీ వాటాను కేంద్రం నిర్ణయిస్తుంది...