బ్యాంకు ఖాతాదారులకు భారత రిజర్వు బ్యాంకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్) ట్రాన్సాక్షన్లపై ఉన్న నిబంధనల్ని తొలగించింది. అత్యవసరంగా పెద్దమొత్తాన్ని మరో ఖాతాకు బదిలీ చేయాల్సివస్తే (ఐఎంపీఎస్- ఇమ్మీడియట్ పేమెంట్) సర్వీస్ పద్దతిలో బదిలీ చేయాల్సి.
బ్యాంక్ పనివేళల్లో కేవలం రెండు లక్షల లోపు ట్రాన్సాక్షన్లను ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6.30వరకే చేయాల్సి ఉంది. బ్యాంక్ హాలిడేస్‌లో ఐఎంపీఎస్ నుంచి ట్రాన్సాక్షన్ చేసేందుకు వీలుపడేది కాదు. దీంతో అత్యవసర సమయాల్లో బ్యాంక్ హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
తాజాగా ఆర్బీఐ ఈ నిబంధనల్ని తొలగించింది. అత్యవసరంగా ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వస్తే ఐఎంపీఎస్ నుంచేకాకుండా నెఫ్ట్ పద్దతిలో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలతో బ్యాంకు సెలవు రోజుల్లో కూడా ట్రాన్స్‌క్షన్స్ చేసుకునే వెసులుబాటు లభించింది.