Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిఎఎస్‌ఎఫ్‌ వారి కొత్త కీటకనాశిని భారతీయ రైతులకు ముఖ్య చీడపీడల నుండి పంటలను రక్షిస్తుంది

BASF
, మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (20:45 IST)
బిఎఎస్‌ఎఫ్‌ నేడు ఆవిష్కరించిన ఎక్స్‌పోనస్ కీటకనాశినితో భారతదేశంలోని రైతులు తమ పంటలను రక్షించుకోగలుగుతారు, ఉత్పాదకతను పెంచుకోగలుగుతారు. ఈ అగ్రగామి సొల్యూషన్‌ బిఎఎస్‌ఎఫ్‌ యొక్క కొత్త క్రియాశీల ఇన్‌గ్రీడియంట్‌ బ్రోఫ్లనిలైడ్ తో ప్రత్యేక ఫార్ములేషన్‌లో శక్తివంతమైంది.

 
కీలక చీడపీడలను నియంత్రించేందుకు కొత్త కార్యాచరణ పద్ధతిని అందిస్తున్న ఎక్స్‌పోనస్‌, అనేక రకాల చీడపీడలను నియంత్రించేందుకు, ఇప్పుడున్న కెమిస్ట్రీలకు నిరోధకతను అధిగమించేందుకు ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా రైతులకు శక్తివంతమైన, త్వరిత, బహుముఖ టూల్‌ని అందిస్తోంది. సోయాబీన్, కంది, మిరప, టొమాటో, వంగ మరియు క్యాబేజి పంటల్లో గొంగళిపురుగులు, థ్రిప్స్‌ లాంటి కీలక చీడపీడలను నియంత్రించేందుకు ఉపయోగించడానికి ఎక్స్‌పోనస్‌ రిజిస్టరు చేయబడింది.

 
‘‘పంట రక్షణలో మేము తాజాగా తీసుకొచ్చిన వినూత్న ఉత్పాదనతో ఇప్పుడు భారతీయ రైతులకు మేలు కలుగుతుంది’’ అంటున్నారు నారాయణ్‌ క్రిష్ణమోహన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, బిఎఎస్‌ఎఫ్‌ ఇండియా లిమిటెడ్‌. ‘‘వ్యవసాయం అనేది పుడమిపై జరిగే అతిపెద్ద పని. బిఎఎస్‌ఎఫ్‌లో, రైతుల అవసరాలను అర్థం చేసుకునేందుకు వాళ్ళు చెప్పేది వినడానికి, కలిసి పనిచేయడానికి మేము అంకితమయ్యాము. కాబట్టి కీటకాల నుంచి పంటలను రక్షించడం, ఉత్పాదకతను పెంపొందించుకోవడంలో ఎదురయ్యే లెక్కలేనన్ని సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కొనేలా మేము మా నైపుణ్యాన్ని వినియోగిస్తాము.’’

 
తన యొక్క విలక్షణమైన కార్యాచరణ పద్ధతితో, కొత్త ఐఆర్‌ఎసి గ్రూప్‌ 30 కింద మార్కెట్‌లో ప్రవేశపెట్టిన మొదటి కాంపౌండ్‌ల్లో ఎక్స్‌పోనస్‌ కీటకనాశిని ఉంది, మార్కెట్‌లో ఇప్పుడున్న ఉత్పాదనలతో క్రాస్‌-రెసిస్టెన్స్‌ లేదని తెలిసిన పూర్తి కొత్త కీటకనాశినిల శ్రేణిని (గ్రూప్‌ 30- మెటా- డయామైడ్స్‌ మరియు ఐసోక్సాజోలినేస్‌) ఇది సూచిస్తూ, దీనిని సర్వోత్తమ కీటకనాశిని నిరోధకత యాజమాన్యం టూల్‌గా చేస్తోంది.

 
‘‘ప్రస్తుత ప్రమాణాలతో పోల్చుకుంటే అతితక్కువ ఉపయోగించే రేట్లతో ఇప్పుడున్న, వృద్ధి చెందుతున్న అనేక రకాల కీటకాలను అదుపు చేయడంలో ఎల్లలు దాటి రైతులకు సహాయపడతామనే విషయంలో బిఎఎస్‌ఎఫ్‌కి గల నిబద్ధతను ఈ వినూత్న ఉత్పాదన పునరుద్ఘాటిస్తోంది. ఎక్స్‌పోనస్‌ని ఉపయోగించడం అనేక రకాల పంటల్లో చీడపీడల నుంచి ప్రభావవంతంగా, సుదీర్ఘ కాలం పాటు రక్షించేందుకు భారతీయ రైతులకు ఉపయోగపడుతుంది.’’ అంటున్నారు రాజేంద్ర వెలగల, బిజినెస్‌ డైరెక్టర్‌, అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌, సౌత్‌ ఆసియా, బిఎఎస్‌ఎఫ్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో ఇన్సిస్టిట్యూట్: పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం