Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో ఇన్సిస్టిట్యూట్: పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Advertiesment
Jio Institute
, మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (19:55 IST)
Jio Institute
ప్రముఖ టెలికాం సంస్థ జియో టెలికమ్యూనికేషన్ నుంచి జియో ఇన్సిస్టిట్యూట్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ల నుంచి సోషల్ మీడియా వరకు, ఇ-మెయిల్, మెసేజింగ్, ఇంటర్నెట్ శోధన, స్మార్ట్ గాడ్జెట్లు, ట్రావెల్, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, కమ్యూనికేషన్లు ఇతరత్రా సేవల్లో జియో కీలక పాత్ర పోషిస్తోంది. 
 
జియో ఉత్పత్తులు, సేవలను విపరీతంగా పెంపొందించడానికి సదరు సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. కస్టమర్లకు అత్యుత్తమంగా కమ్యూనికేట్ చేసేందుకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ మీడియా, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది జియో.
 
2025 నాటికి భారత జీడీపీకి 450-500 బిలియన్ డాలర్లను జోడించే సామర్థ్యం ఏఐ, డేటా సైన్స్ ఉందని నాస్కామ్ నివేదికలు చెబుతున్నాయి. భారత మీడియా, వినోద పరిశ్రమ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మీడియా పరిశ్రమలలో జియో 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబి) తెలిపింది.
 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, డిజిటల్ మీడియా అండ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ యొక్క అభివృద్ధి చెందుతున్న రంగాలలో జియో ఇన్సిస్టిట్యూట్ తన ఒక సంవత్సరం పూర్తి-సమయ పోస్ట్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ (పిజిపి) కోసం దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించింది.
 
డిజిటల్ మీడియా అండ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ (డీఎం అండ్ ఎంసీ)లోని పీజీపీ కోర్సు విద్యార్థులకు  సృజనాత్మకంగా నిమగ్నం కావడం, సేవ చేయడం, వారితో కమ్యూనికేట్ చేయడం ద్వారా డిజిటల్ యుగంలో కస్టమర్ అనుభవాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై నాలెడ్జ్‌ని పొందడంలో సహాయపడుతుంది. 
 
ఏఐ అండ్ డీఎస్ ప్రోగ్రామ్ పూర్తి-స్టాక్ డేటా శాస్త్రవేత్తలుగా మారాలని కోరుకునే విద్యార్థుల కోసం ఈ కోర్సు రూపొందించబడింది. మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, బ్రాండ్ కన్సల్టింగ్, డిజిటల్ మార్కెటింగ్, మార్కెటింగ్ అనలిటిక్స్, కన్స్యూమర్ రీసెర్చ్ వంటి రంగాల్లో కెరీర్‌ను నిర్మించాలని కోరుకునే ప్రారంభ కెరీర్ ప్రొఫెషనల్స్ కొరకు అతడు డీఎం అండ్ ఎంసీ ప్రోగ్రామ్ రూపొందించబడింది. 
 
ఇందుకు కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కనీసం ఒక కోర్సును ఏఐ అండ్ డీఎస్ అభ్యర్థులు పూర్తి చేసి ఉండాలి. డీఎం అండ్ ఎంసీ అభ్యర్థులు ఏదైనా విభాగంలో కనీసం మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. 
 
ఈ రెండు ప్రోగ్రామ్ల కోసం, గ్రాడ్యుయేషన్లో కనీసం 50% లేదా ఈక్వలెంట్ సిజిపిఎ, జూలై 1, 2022 నాటికి కనీసం 18 నెలల అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు జియో అధికారిక వెబ్ సైట్ www.jioinstitute.edu.inలో అప్లై చేసుకోవచ్చు. 
 
ఈ లింక్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్‌లతో పాటుగా ఆన్‌లైన్ టెస్టుకు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి వుంటుంది. ఆన్‌లైన్ జియో ఇనిస్టిట్యూట్ ఎంట్రన్స్ టెస్ట్ (జెట్) కొరకు హాజరయ్యే రూ. 2500 అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి వుంటుంది. 
 
ఈ టెస్టులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ ఆధారంగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, రైటింగ్ స్కిల్స్‌పై ఒక సెక్షన్ ఉంటాయి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్సీపీకి షాక్: తెలుగుదేశం పార్టీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి ?