Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31వ తేదీ నుంచి రెండురోజులు బ్యాంకులు బంద్

Advertiesment
Nation Wide
, మంగళవారం, 28 జనవరి 2020 (15:29 IST)
వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. తమ జీతాలను 20 శాతం పెంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పబ్లిక్ సెక్టార్ యూనియన్ బ్యాంకులు కోరుతున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరసనకు దిగుతున్నామని పేర్కొన్నారు. 
 
ఈ నెల 31వ తేదీ నుంచి రెండు రోజుల పాటు తమ స్ట్రైక్ కొనసాగనుందని స్పష్టంచేశారు. రెండురోజులపాటు స్ట్రైక్ చేస్తున్నామని యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎప్‌బీయూ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్పెడరేషన్ (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయ్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (నేవోబీడబ్ల్యూ)కు చెందిన బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటారు. 
 
తమ సమస్యలపై సోమవారం బ్యాంకు సంఘం ప్రతినిధులు చీఫ్ లేబర్ కమిషనర్‌తో చర్చలు జరిపారు. కానీ చర్చలు సానుకూలంగా జరగకపోవడంతో తాము సమ్మెకు వెళుతున్నట్టు ఏఐబీవోసీ అధ్యక్షులు సునీల్ కుమార్ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణానదిలో రైతుల వినూత్న నిరసన