Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీఎస్టీ ఉమ్మడి నిర్ణయం : ప్రధాని నరేంద్ర మోడీ

'జీఎస్టీ అమలు నా ఒక్కడి నిర్ణయం కాదు. పార్లమెంట్ ఒక్కటే నిర్ణయించలేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమది. ఈ నిర్ణయంలో కాంగ్రెస్‌ పార్టీకీ సమాన భాగస్వామ్యముంది. ఇందులో కేంద్ర

జీఎస్టీ ఉమ్మడి నిర్ణయం : ప్రధాని నరేంద్ర మోడీ
, మంగళవారం, 17 అక్టోబరు 2017 (09:03 IST)
'జీఎస్టీ అమలు నా ఒక్కడి నిర్ణయం కాదు. పార్లమెంట్ ఒక్కటే నిర్ణయించలేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమది. ఈ నిర్ణయంలో కాంగ్రెస్‌ పార్టీకీ సమాన భాగస్వామ్యముంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం చిన్న పాత్రధారి మాత్రమే' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని వ్యాఖ్యానించారు. 
 
గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో సోమవారం నిర్వహించిన ‘గుజరాత్‌ గౌరవ మహా సమ్మేళనం’లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'జీఎస్టీ సంస్కరణను అమలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి మోడీ ఒక్కడే తీసుకోలేదు. జీఎస్టీ కౌన్సిల్లో 30 వరకూ పార్టీలున్నాయి. వాటన్నింటినీ సంప్రదించాం. నిర్ణయాల్లో వాటినీ భాగస్వాములను చేశాం. జీఎస్టీ నిర్ణయాల్లో కాంగ్రెస్‌ కూడా సమాన పాత్రధారి. ఇప్పటికైనా ఆ పార్టీ జీఎస్టీపై అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలి' అని ధ్వజమెత్తారు. 
 
అదేసమయంలో మూడు నెలల తర్వాత జీఎస్టీ అమలును సమీక్షిస్తామన్నారు. అప్పుడు డిమాండ్లను పరిష్కరించడానికి పలు మార్పులు చేస్తామన్నారు. గుజరాత్‌లో ఐదోసారీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రధాని మోడీ... 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. కులతత్వం, మతతత్వం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్‌ ఆయుధాలని మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..?