Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లుడు నీకు ఈ పార్టీనే కరెక్ట్... రేవంత్ రెడ్డికి జైపాల్ ఆఫర్....

తెలంగాణా టిడిపిలో ఆయనో చిచ్చరపిడుగు. ఆ పిడుగు టి.కాంగ్రెస్ పార్టీకి దొరికిపోయాడు. అన్నీ కుదిరితే అతి త్వరలోనే కాంగ్రెస్ కండువా మార్చుకోవడం ఖాయమంటున్నారు. అందుకే ఇన్నాళ్ళు ఎంతో సీనియారిటీ వున్నా తామేమీ చేయలేకపోయామనీ, అలాంటిది రేవంత్ వస్తే మాత్రం ఏం చే

Advertiesment
అల్లుడు నీకు ఈ పార్టీనే కరెక్ట్... రేవంత్ రెడ్డికి జైపాల్ ఆఫర్....
, సోమవారం, 16 అక్టోబరు 2017 (21:32 IST)
తెలంగాణా టిడిపిలో ఆయనో చిచ్చరపిడుగు. ఆ పిడుగు టి.కాంగ్రెస్ పార్టీకి దొరికిపోయాడు. అన్నీ కుదిరితే అతి త్వరలోనే కాంగ్రెస్ కండువా మార్చుకోవడం ఖాయమంటున్నారు. అందుకే ఇన్నాళ్ళు ఎంతో సీనియారిటీ వున్నా తామేమీ చేయలేకపోయామనీ, అలాంటిది రేవంత్ వస్తే మాత్రం ఏం చేయగలడన్న పెదవి విరుపులు కూడా కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి.
 
కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ నేతల్లో అప్పుడే చర్చ మొదలైంది. చంద్రబాబుతో టి.టిడిపి నేతలు సమావేశమై ఇదే విషయంపై గత కొన్నిరోజుల నాలుగురోజుల ముందు చర్చించినట్లు సమాచారం. వీరి సమావేశం తరువాత రేవంత్ రెడ్డి వ్యవహారంపై మరింత తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రేవంత్‌కు ప్రచార కమిటీ అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్‌కు ధీటుగా సమాధానం చెప్పే వారిలో రేవంత్ ఒకరు. జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ కూడా రేవంత్ పార్టీలోకి వస్తున్నారని సన్నిహితులకు చెబుతున్నట్లు సమాచారం. 
 
రాహుల్ సమక్షంలోనే రేవంత్ రెడ్డి త్వరలో పార్టీ పుచ్చుకోవడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అల్లుడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని జైపాల్ రెడ్డి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జైపాల్ రెడ్డే అన్నీ తానై రేవంత్ రెడ్డి విషయంలో అందరికన్నా ముందుండి పార్టీలోకి త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడైన తరువాత ఆయన హైదరాబాద్ పర్యటన సమయంలో రేవంత్‌ను పార్టీలో తీసుకోవాలన్నది జైపాల్ ఆలోచనగా వున్నట్లు చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18 గంటలపాటు చదువులా? కార్పొరేట్ కాలేజీల్లో నరకం... విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు...