2019లో అదే జరిగితే పవనే సీఎం.. సీన్లోకి చిరు.. త్రివిక్రమ్-పవర్ సినిమా రైట్స్ రూ.21 కోట్లు?
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ, రాజకీయాలపై విభిన్న రకాల వార్తలొస్తున్నాయి. నిన్నటికి నిన్న పవన్ కల్యాణ్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కలుపుకుని 2019 ఎన్నికల బరిలోకి దిగుతారని.. అలా చ
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ, రాజకీయాలపై విభిన్న రకాల వార్తలొస్తున్నాయి. నిన్నటికి నిన్న పవన్ కల్యాణ్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కలుపుకుని 2019 ఎన్నికల బరిలోకి దిగుతారని.. అలా చేస్తే తప్పకుండా పవనే సీఎం అవుతారని మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తలపై పవన్ కల్యాణ్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అసలు ఇలాంటి వార్తలెలా వస్తాయని సన్నిహితులతో పవన్ అన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకుపోతున్న పవన్ త్వరలోనే.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఎంపీగా వున్న కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుపోతారని.. తద్వారా ఆ పార్టీల జెండాలపై గెలిచి.. సీఎం అవుతారని కథనాలొచ్చాయి. అయితే నిజానికి ఈ వార్తల్లో నిజం లేదని పవన్ సన్నిహితులతో అన్నట్లు సమాచారం.
దీనికి సంబంధించి అన్నయ్య చిరంజీవితో పవన్ భేటీ అయ్యారని.. మెగాస్టార్ సూచన మేరకే పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల బరిలోకి దిగుతారని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో 2019 ఎన్నికల్లో పవన్ లేకుండా ఎలా పోటీ చేయాలనే దానిపై తెలుగు దేశం పార్టీ సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ వ్యవహారం ఫిల్మ్ నగర్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఈ చిత్రం నిర్మాతలు ఓవర్సీస్ హక్కులను రూ.21కోట్లకు అమ్మేందుకు సిద్ధపడ్డారని.. బ్లూ స్కై సంస్థ రూ.19 కోట్లకి బేరమాడినా ప్రయోజనం లేకపోవడంతో రూ.21 కోట్లకే ఓవర్సీస్ హక్కుల్ని అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అగ్రిమెంట్లలో ఇరు పక్షాల వారు సంతకాలు చేసుకునేందుకు రెడీ అయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.