Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మీనం
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 2 అవమానం: 4 ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అధికం. కార్యసిద్ధికి మరింతగా శ్రమించాలి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. దంపతుల ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవివాహితులకు శుభయోగం. రుణ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా వుండాలి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు యోగకాలం. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో కూడిన స్థానచలనం. తరచూ వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. స్టాకిస్టులు, హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కార్మికులు, చేతివృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఏమంత పురోగతి ఉండదు. వ్యవసాయ దిగుబడులు ఆశాజనకం. మద్దతు ధర ఆశించినంత సంతృప్తినీయజాలదు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.