Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం విషయంలో శుభపరిణామాలనున్నాయి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ఆత్యీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం. ఉన్నతాధికారులకు హోదామార్పు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. హోల్‌‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి.