Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆశావహదృక్పథంతో శ్రమిస్తే మంచి ఫలితాలుంటాయి. మీ సామర్ధ్యానికి గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ఆదాయ బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం పై చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, మధ్యవర్తులను నమ్మవద్దు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు.