Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఖర్చులు అధికం. పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బుధవారం నాడు ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణలకు తరుణం కాదు.