Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. నిర్దేశిత లక్ష్యాలతో యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, సోమవారాల్లో పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కొన్ని పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు శ్రమ, త్రిప్పట అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.