Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు వాగ్ధాటితో రాణిస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆదివారం నాడు కొందరి రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు, పనులు సాగవు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం ఉల్లాసాన్నిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త.