Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల రాక ఉల్లాసాన్నిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా వదిలేయండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు శుభపరిణామాలున్నాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.