Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కుంభం
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పిల్లల వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. శుక్ర, శని వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.