Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బుధ, గురు వారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సోదరుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలకు యత్నాలు సాగిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. బిల్డర్లకు ఒత్తిడి, శ్రమ అధికం. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి.