Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు పరిస్థితులు మెరుగుపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీపై శకునాల ప్రభావం అషధికం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధ్యాయులకు కష్టకాలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.