Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం.