Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆప్తుల రాక ఉల్లాసం కలిగిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మంగళ, శని వారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.