Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కన్య
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు ఈ వారం గ్రహాల అనుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి.