Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము పంతాలు, భేషజాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహారం చక్కబెట్టుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధుత్వాలు బలపడతాయి. సోమ, మంగళ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అకారణ కలహం. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.