Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

తుల
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు మీ భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి. కొంత మంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరినీ నొప్పించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు అనుకూలించవు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పర్మిట్లు, లైసెన్సులు మంజూరవుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కోర్టువాయిదాలకు హాజరవుతారు.