Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

సింహం
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయానికి నిరుత్సాహపడవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహ ఉంటుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయతాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్మోగస్తులకు కష్టసమయం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. చిన్ననాటి పరిచయసులు తారసపడతారు.