Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు కార్యం సిద్ధిస్తుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. అధికారులకు హోదామార్పు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.