Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

ధనస్సు
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా పాటించండి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. గత సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. ప్రముఖులకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు.